‘మహర్షి’ కాంబోపై ఇంట్రెస్టింగ్ రూమర్!

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమా గతేడాది మంచి సక్సెస్ అందుకుంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. ఈ సినిమా హిట్ కావడంతో వంశీతో మహేష్ మరో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. వంశీ చెప్పిన కథ మహేష్ కి నచ్చక ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి.. దర్శకుడు పరశురామ్ తో ‘సర్కారు వారి పాట’ను లైన్ లో పెట్టాడని వార్తలొచ్చాయి. మహేష్.. వంశీ ప్రాజెక్ట్ కి నో చెప్పి పది నెలలు దాటిపోయింది.

ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కి మరో కథ చెప్పి ఫార్మల్ గా ఓకే చేయించుకున్నాడు వంశీ పైడిపల్లి. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఇప్పుడు మరోసారి మహేష్, వంశీల ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఈసారి ఓ మాస్ కథ చెప్పి మహేష్ ని మెప్పించాడట వంశీ. వీరి కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ రాబోతుంది. ఆ చిత్రానికి ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మహేష్ భార్య నమ్రత పోస్ట్ చేసిన ఒక ఫోటో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.

మహేష్ తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోగా.. అందులో వంశీ కూడా ఉన్నాడు. వీరిద్దరూ మరోసారి కలిసి కనిపించడంతో సినిమా లైన్లో ఉన్నట్లేనని భావిస్తున్నారు. నిజంగానే వీరిద్దరూ కలిసి మాస్ సినిమా చేస్తారా..? దానికి చిరు పాత టైటిల్ పెడతారా అనే విషయాలు పక్కన పెడితే.. వీరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని చెబుతున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus