Balakrishna, Mahesh Babu: బాలయ్య కోరికను తీర్చడానికి జక్కన్న సిద్ధమయ్యారా?

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కాకుండా 40 నిమిషాల నిడివి ఉన్న కీలకమైన పాత్ర ఉందని గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పాత్రలో స్టార్ హీరో బాలకృష్ణ నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చాలా సంవత్సరాల క్రితం రాజమౌళి బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే సింహాద్రి కథ బాలయ్యకు నచ్చకపోవడంతో బాలయ్య రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాలేదు.

Click Here To Watch

మగధీర, బాహుబలి సిరీస్ వల్ల రాజమౌళికి ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నానని తన మనస్సులోని మాటను బయటపెట్టారు. మహేష్ బాలయ్య కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవు. అయితే బాలయ్య పేరును రాజమౌళి పరిశీలిస్తున్నారని అధికారికంగా మాత్రం ఫిక్స్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. బాలయ్య మహేష్ బాబు మధ్య కూడా మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే.

మరి ఈ కాంబినేషన్ లో నిజంగా సినిమా తెరకెక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా కథలో మార్పులుచేర్పులు జరుగుతున్నాయని సమాచారం. పాన్ ఇండియా మూవీగా మహేష్ రాజమౌళి కాంబో మూవీ తెరకెక్కనుంది. రాజమౌళి చేయాలని కోరితే బాలయ్య తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా నో చెప్పే అవకాశం ఉండదు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.

2024 సంవత్సరంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను వేగంగానే పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. మహేష్ ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus