విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న కార్తికేయ..!

గతేడాది వచ్చిన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు హీరో కార్తికేయ. ఈ చిత్ర విజయంతో ప్రస్తుతం మంచి అవకాశాలే వస్తున్నాయి కార్తికేయకి…! ప్రస్తుతం ‘హిప్పీ’ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దీంతో పాటు బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. మరో నాలుగు చిత్రాలు కూడా డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న కార్తికేయ… ఇప్పుడు విలన్ గా కూడా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది.

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు విక్రమ్.కె.కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం తెరెకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇది నాని కి 24 విచిత్రం కావడం విశేషం. ఇందులో నాని ప్లే బాయ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర కథ ప్రకారం సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, మేఘాఆకాష్, ప్రియా ప్రకాష్ వారియర్ లను హీరోయిన్లుగా ఎంచుకున్నారు. మరో ఇద్దరి హీరోయిన్ల కోసం కూడా గాలిస్తున్నారు. అలానే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన విలన్ పాత్ర కోసం కార్తికేయను సంప్రధించారట.

విక్రమ్ వినిపించిన కథకి కార్తికేయ ఏమాత్రం.. ఆలోచించకుండా ఓకే.. చేసేశాడని తెలుస్తుంది. విలన్ రోల్ చేయడానికి కార్తికేయ చాలా ఎగ్జైట్ అయ్యాడట. దీంతో అతడినే విలన్ గా ఫైనల్ చేసుకున్నారని స్పష్టమవుతుంది. ఇక సినిమా ట్రైలర్ బయటకి వచ్చే వరకూ కూడా కార్తికేయ పాత్రను సీక్రెట్ గానే ఉంచాలని విక్రమ్ కుమార్ భావిస్తున్నాడట. గతంలో నాని ‘నేను లోకల్’ చిత్రంలో విలన్ గా నటించిన నవీన్ చంద్ర కి కూడా ఇప్పుడు మంచి అవకాశాలే దక్కుతున్నాయి. ఇక విభిన్న చిత్రాలు తెరకెక్కించడంలో విక్రమ్ సిద్దహస్తుడు కాబట్టి కార్తికేయకి మంచి క్యారెక్టర్ ఇస్తాడనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus