ఆర్ఎక్స్ 100 ఆరు రోజుల కలెక్షన్స్!

చిన్న సినిమా, పెద్ద సినిమా.. యువ హీరో, స్టార్ హీరో.. అనేదాన్ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోరు. మూడు గంటలు పాటు వినోదాన్ని పంచితే చాలు.. ఆ మూవీ హౌస్ ఫుల్ కావల్సిందే. ఆర్ఎక్స్ 100 మూవీ విషయంలోను ఇదే రిపీట్ అయింది. రిపీట్ ఆడియన్స్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. కొత్త నటుడు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఈనెల 12 న రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా తొలిరోజు నుంచి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రోజురోజుకి కలక్షన్స్ పెంచుకుంటూ సాగిపోతోంది.

అశోక్ రెడ్డి గుమ్మకొండ రెండు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఐదురోజుల్లో 6 .14 కోట్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఆరో రోజు 78.68 లక్షల షేర్ రాబట్టి ఏడుకోట్ల మార్క్ కి చేరువైంది. ఆరో రోజు ఏరియాల వారీగా కలక్షన్స్ (షేర్) వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 39.56 లక్షలు
సీడెడ్ : 10.15 లక్షలుఉత్తరాంధ్ర : 8.44 లక్షలు
గుంటూరు : 4.27 లక్షలుకృష్ణ : 4.17 లక్షలు
ఈస్ట్ గోదావరి : 5.53 లక్షలు
వెస్ట్ గోదావరి : 4.43 లక్షలునెల్లూరు : 2.13 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో : 78.68 లక్షలుఆరు రోజుల పూర్తి షేర్ : 6.93 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus