ఆర్ఎక్స్ 100 పూర్తి కలక్షన్స్

సాధారణంగా మనం ఊహించనిది జరిగినప్పుడు.. ఆ అద్భుతానికి కొత్త పేర్లు పెట్టాల్సి వస్తుంది. అలాంటి ఊహించని అద్భుతమే ఆర్ఎక్స్ 100 మూవీ. స్టార్ హీరో కాదు.. ఫేమస్ హీరోయిన్ లేదు.. మెగా ఫోన్ పట్టిన అనుభవం లేదు.. వీరి కలయికలో వచ్చిన మూవీ బడ్జెట్ రాబట్టడమే విశేషం.. అందుకు రెండింతలు ఆదాయం వస్తే బ్లాక్ బస్టర్ హిట్ అంటారు. ఐదింతలు వసూలు చేస్తే.. అందుకు ట్రేడ్ వర్గాల వారు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా పేరు పెట్టారు. కొత్త నటుడు కార్తికేయ హీరోగా, రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అందాలతో కనువిందుచేస్తోంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం జులై 12 న రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే బడ్జెట్ ని రాబట్టిన ఈ చిత్రం.. లాంగ్ రన్ లో 12 .45 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. చిన్న చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఏరియాల వారీగా పూర్తి కలక్షన్స్ వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 5.30 కోట్లు
సీడెడ్ : 1.50 కోట్లుఉత్తరాంధ్ర : 1.50 కోట్లు
గుంటూరు : 0.70 కోట్లు
కృష్ణ : 0.70 కోట్లుఈస్ట్ గోదావరి : 0.90 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.70 కోట్లు
నెల్లూరు : 0.30 కోట్లుఇతర రాష్ట్రాల్లో : 0.45 కోట్లు
ఓవర్సీస్ : 0.40 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 12.45 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus