మిగిలిన హీరోయిన్లు పాయల్ ను చూసి చాలా నేర్చుకోవాలి..!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడికి భారీ ఆఫర్లు రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో ఆఫర్లు రాకపోయినా మంచి ఆఫర్లే వస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్ తో ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రంతో పాటూ రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా నటిస్తుంది. బాలయ్యతో కూడా ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యింది. ఇంతలా క్రేజీ సినిమాల్లో నటిస్తూనే ‘ఆర్.డి.ఎక్స్’ అనే చిన్న చిత్రంలో కూడా నటిస్తుంది. సాదారణంగా పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఏ హీరోయిన్ కూడా చిన్న సినిమాల్లో నటించడానికి మొహం చాటేస్తుంటారు. కానీ పాయల్ మాత్రం అలాంటి నామోషీ ఫీలింగ్ లేకుండా చిన్న చిత్రాలకి కూడా ఓకే అంటుందట. తనకి ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టిన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రం కూడా చిన్న సినిమానే కథా అని అంటుందట పాయల్.

ఇక త్వరలో విడుదల కాబోతున్న ‘సీత’ చిత్రంలో కూడా పాయల్ ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు కూడా పాయ‌ల్ కి మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో పాయ‌ల్ ఎంతడిగినా ఇవ్వ‌డానికి రెడీ అయిపోతున్నారట. అయినప్పటికీ… ఎవ‌రు ఎంత ఇస్తే, అంత తీసుకుని షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌కి వచ్చేస్తుందట పాయల్. ఒక‌ట్రెండు సినిమాలు చేసిన వాళ్ళే 5 నుండీ 8 ల‌క్షల వరకూ డిమాండ్ చేస్తుంటే… పాయ‌ల్ మాత్రం 3 ల‌క్ష‌లు ఇచ్చినా ఓకే చెప్పేస్తుందట. ఇప్పటికే ఇలా సంపాదించిన డబ్బుతో ముంబైలో ఓ ఫ్లాటు కూడా కొనుక్కుంద‌ట‌ ఈ బ్యూటీ. ఏదేమైనా అతి జోలికి పోకుండా ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అని పాయల్ బాగా గ్రహించినట్టుంది. ‘ఈ అమ్మడు తెలివి తేటలు చూసి మిగిలిన హీరోయిన్లు కూడా చాలా నేర్చుకోవాలి’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus