RX 100.. యూత్ ఎగబడి చూసిన సినిమా.. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతిలను ఓవర్‌నైట్ స్టార్స్‌ని చేసిన సినిమా.. ఈ ఫిలిం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, మ్యూజిక్, డైలాాగ్స్, రాంకీ, రావు రమేష్ లాంటి క్యారెక్టర్లు.. ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో హీరోయిన్ రోల్ చూసి ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. ‘అర్జున్ రెడ్డి’ ని మించిన రొమాన్స్ రచ్చతో బాక్సాఫీస్ బరిలో భారీ హిట్ కొట్టింది RX 100..
అయితే ఇలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతో గతంలోనే ఓ సినిమా వచ్చింది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ మీద టాప్ ప్రొడ్యూసర్ రామోజీ రావు నిర్మాతగా.. సీనియర్ డైరెక్టర్ వి.మధుసూదన రావు దర్శకత్వంలో ‘కాంచన గంగ’ అనే రొమాంటిక్ మూవీ వచ్చింది. చంద్ర మోహన్, శరత్ బాబు, సరిత, స్వప్న మెయిన్ లీడ్స్.. చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రం 1984లో వచ్చింది. RX 100 పోలికలుంటాయి కానీ కథ పరంగా దానికీ, దీనికీ ఎలాంటి సంబంధం ఉండదు..
కంప్లీట్ ఫ్యామిలీ సినిమానే కానీ స్వప్న, చంద్ర మోహన్‌ల ట్రాక్ మాత్రం RX 100 టైపులో ఉంటుంది. అప్పట్లో ఈ తరహా పాత్రలంటే ప్రేక్షకులకు కాస్త షాక్, మరికొంత సర్‌ప్రైజ్ అన్నట్లు ఉండేది.. కాంచన (సరిత), గంగ (స్వప్న) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.. కాంచన, ప్రభాకర్ (చంద్ర మోహన్)ని పెళ్లి చేసుకోబోతుంది. అతని ఇంటికి ఫ్రెండుని కూడా తోడు తీసుకెళ్తుంది. ప్రభాకర్ ఇంటికి వెళ్లాక అతని ఆస్తిపాస్తుల గురించి తెలుసుకున్న గంగ ఎలాగైనా ప్రభాకర్‌ని తనే చేసుకోవాలనుకుంటుంది.
పాయల్ రాజ్‌పుత్‌లానే ప్రభాకర్‌ని చెడ గొడుతుంది గంగ.. ఇదంతా కాంచనకి, ప్రభాకర్ వాళ్ల ఇంట్లో వాళ్లకి తెలుస్తుంది. జయసింహ (శరత్ బాబు) ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ముందు నుండి ఈ విషయంలో కాంచనకి సాయం చేయాలనుకుంటాడు కానీ ఆమె అతణ్ణి అసహ్యించుకుంటూ ఉంటుంది. ప్రభాకర్, గంగకి ఉద్యోగం ఇప్పించమని తన సీనియర్ మోహన్ (ప్రతాప్ పోతన్)కి చెప్తాడు. ప్రభాకర్‌ని ఆఫీసు వర్క్ మీద బయట ఊరికి పంపి.. గంగని వల్లో వేసుకుంటాడు మోహన్.
ఆమె కూడా అడ్డుచెప్పదు. ఈ ప్రాసెస్‌లో జయసింహ, కాంచనని సేవ్ చేయడం.. ఇద్దరూ కలిసి ఉండడం.. అతని సాయంతోనే తను లాయర్ అవడం.. జయసింహ గురించి నిజం తెలిసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కట్ చేస్తే.. మోహన్ ఓరోజు గంగని మరో వ్యక్తితో ఉండమని ఇబ్బంది పెడతాడు.. వినకపోతే ఆమెను బలవంతం చేస్తాడు.. దీంతో గంగ అతగాడిని మర్డర్ చేస్తుంది.. ఇలాంటి ఎన్నో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ‘కాంచన గంగ’ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది..