2026 ఆరంభం నుండే సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్లోనే కాకుండా మిగతా భాషల్లోని సినీ ప్రముఖులు కూడా మృత్యువాత పడటం అనేది అందరినీ కలవరపరుస్తోంది. వయోభారంతో కొందరు, అనారోగ్యం పాలై మరికొందరు, రోడ్డు ప్రమాదాలకు గురై ఇంకొందరు.. ఇలా మరణాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు లేదా వారి బంధుమిత్రులు కూడా మరణిస్తుండటం హాట్ టాపిక్ అవుతుంది.
ఇటీవల అల్లరి నరేష్ తాతయ్యగారు అయినటువంటి వెంకట్రావ్ గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుండి ఇండస్ట్రీ కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.వివరాల్లోకి వెళితే… లెజెండరీ సింగర్ అయినటువంటి ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(Murali Krishna) ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్ళు.మరో స్టార్ సింగర్ అయినటువంటి చిత్ర ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మురళీ మరణ వార్త వినగానే షాక్‌కు గురైనట్టు తన ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ గా రాసుకొచ్చారు చిత్ర. దీంతో ఆమె ఫాలోవర్స్ అంతా రిప్(RIP) అంటూ కామెంట్లు చేస్తున్నారు.మురళీ కృష్ణ భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారన్న విషయం ఇప్పటి యువతకి తెలిసుండకపోవచ్చు. అలాగే పలు సినిమాల్లో కూడా నటించారు. కానీ నటుడిగా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. ఇక మురళీ కృష్ణకి భార్య… ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
టాలీవుడ్ నుండి కూడా కొంతమంది సినీ ప్రముఖులు మురళీ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని.. అతని ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సంతాపం తెలుపుతున్నారు.