ప్రభాస్… దీనికి కూడా ఇంత బడ్జెట్ అవసరమా…?

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా రామోజీ ఫిలింసిటీలో ఈ చిత్రానికి సంబందించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు.

శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం మేకింగ్ వీడియో కి మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రానికి ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్ గా నిలువబోతుందట. ‘ఆర్ఎఫ్.సి’ లో ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీ సెట్ వేస్తున్నారట. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. దీని కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు .. స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారని తెలుస్తుంది. జాకీష్రాఫ్ .. నీల్ నితిన్ ముఖేశ్ .. మందిరా బేడీ వంటి బాలీవుడ్ నటుడు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని నమోదుచేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus