‘సాహో’ విలన్ పనైపోయింది..!

గతంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ‘బ్రూస్ లీ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు అరుణ్ విజయ్. ఆ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ అరుణ్ విజయ్ నటనకు మంచి పేరొచ్చింది. అయితే ఆ చిత్రం తరువాత విజయ్ మళ్ళీ తెలుగు సినిమాలో నటించలేదు. చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సాహో’ చిత్రంలో ఓ విలన్ గా నటిస్తున్నాడు. ఓ వైపు తమిళనాడులో హీరోగా నటిస్తూనే… మరో వైపు విలన్ గా కూడా చేస్తూ అరుణ్ విజయ్ చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా ‘సాహో’ షూటింగ్లో పాల్గొంటూ వస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నాడట. దీంతో విజయ్ తో కేక్ కట్ చేయించారు ఈ చిత్ర యూనిట్ సభ్యులు. ‘సాహో’ చిత్రంలో తన పాత్రకి కచ్చితంగా మంచి పేరొస్తుందనీ, తెలుగులో తనకి మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందని అరుణ్ విజయ్ ధీమాగా ఉన్నాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus