ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో బుల్లి తెరపై వచ్చేస్తుంది.

గత ఏడాది ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈచిత్రం మిశ్రమ ఫలితాలు అందుకుంది. ప్రపంచం వ్యాప్తంగా షుమారు 420 కోట్ల వసూళ్లతో 2019 హైయెస్ట్ గ్రాస్సింగ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రాన్ని అధిక ధరలకు విక్రయించిన నేపథ్యంలో అనేక చోట్ల సాహో నష్టాలు మిగిల్చింది. తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజ్ లలో సాహో అనుకున్నంత విజయం సాధించి లేకపోయింది. ఐతే అనూహ్యంగా హిందీలో సాహో సూపర్ హిట్ గా నిలిచింది. అక్కడ ప్రేక్షకులు సాహో చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అతి దారుణమైన రివ్యూలు పొందిన సాహో ప్లాప్ టాక్ తో కూడా 150కోట్లకు పైగా వసూళ్లతో హిందీ డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు పంచింది.

కాగా వెండి తెరపై సూపర్ సక్సెస్ సాధించిన సాహో హిందీ వర్షన్ మొదటిసారి బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ నెల 26 సాయంత్రం 8 గంటలకు సాహో జీ టీవీ నందు రిపబ్లిక్ డే కానుకగా ప్రసారం కానుంది. వెండి తెరపై సూపర్ సక్సెస్ సాధించిన సాహో బుల్లి తెరపై ఏ స్థాయి ఆదరణ దక్కించుకుంటుంది అనేది ఆసక్తికరం.విడుదలకు ముందు ఈ చిత్రానికి వచ్చిన భారీ హైప్ రీత్యా జీ టీవీ యాజమాన్యం భారీ ధర చెల్లించి సాహో శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారు. నార్త్ ఇండియా ప్రేక్షకులు సాహో చిత్రాన్ని బాగానే ఆదరించారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు 350కోట్ల బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాహో తెరకెక్కింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ జాన్ అనే పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నారు. రాధ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus