‘సాహో’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. తాజాగా(ఆగష్టు 30న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. ‘బాహుబలి2’ తరువాత సుమారు రెండేళ్ళు గ్యాప్ తర్వాత ప్రభాస్ నుండీ ఇలాంటి సినిమా ఏంటి అనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ హై రేంజ్ యాక్షన్ వాల్యూస్ కు, ప్రభాస్ నటనకి మార్కులే పడ్డాయి. ‘ప్రభాస్ ఉండగా.. టాక్ తో సంబంధమేంటి’ అంటూ ప్రేక్షకులు ‘సాహో’ చిత్రం చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అదిరిపోయాయి.

ఇక ‘సాహో’ చిత్రం ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

నైజాం – 20.38 కోట్లు
వైజాగ్ – 6.62 కోట్లు
సీడెడ్ – 8.40 కోట్లు


వెస్ట్ – 4.61 కోట్లు
ఈస్ట్ – 5.68 కోట్లు
కృష్ణా – 3.90 కోట్లు


గుంటూరు – 6.34 కోట్లు
నెల్లూరు – 3.26 కోట్లు
———————————————————–
ఏపీ + తెలంగాణ – 59.19 కోట్లు


కర్ణాటక – 12.90 కోట్లు
కేరళ – 1.21 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 47.50 కోట్లు


యూ.ఎస్.ఏ – 9.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 9.50 కోట్లు
————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 152.96 కోట్లు (షేర్)
————————————————————–

‘సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి మొదటి రోజు 73.58 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 220 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటి రోజు వచ్చిన డివైడ్ టాక్ ను బట్టి చూస్తే అసాధ్యమనే అనిపిస్తుంది. ఎంత డిజాస్టర్ రివ్యూలు వచ్చినా తెలుగు కంటే ఎక్కువగా హిందీలో వసూళ్ళు రావడం ఆశ్చర్యం కలిగించే విశేషం. ఇక సోమవారం నాడు వినాయక చవితి సెలవు ఉంది కాబట్టి మంచి వసూళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ‘సాహో’ జర్నీ ఎంతవరకూ సాగుతుంది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus