యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. తాజాగా(ఆగష్టు 30న) విడుదలైన ఈ చిత్రం మొదటి వారం పూర్తి చేసుకుంది. విడుదల రోజు మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. మొదటి మూడు నాలుగు రోజులు సెలవులు పుణ్యమా అని మంచి కలెక్షన్లు అయితే వచ్చాయి. కానీ 5 వ రోజైన మంగళవారం నుండీ వసూళ్ళు బారీగా పడిపోయాయి. నెగిటివ్ రివ్యూలు, రేటింగ్ లు వీకెండ్స్ లో దెబ్బ తీయలేకపోయాయి కానీ వీక్ డేస్ లో మాత్రం గట్టి దెబ్బ కొట్టాయనే చెప్పాలి. హిందీలో మంచి వసూళ్ళు వస్తున్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బుకింగ్స్ చాలా డల్ అయిపోయాయి. చిత్ర యూనిట్ సభ్యులు సైతం ఈ చిత్రానికి ప్రమోషన్స్ ఏమీ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు.
ఇక ‘సాహో’ చిత్రం 7 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం – 26.93 కోట్లు
వైజాగ్ – 8.92 కోట్లు
సీడెడ్ – 11.10 కోట్లు
వెస్ట్ – 5.49 కోట్లు
ఈస్ట్ – 6.92 కోట్లు
కృష్ణా – 4.79 కోట్లు
గుంటూరు – 7.46 కోట్లు
నెల్లూరు – 3.89 కోట్లు
———————————————————–
ఏపీ + తెలంగాణ – 75.51 కోట్లు
కర్ణాటక – 16.50 కోట్లు
కేరళ – 1.47 కోట్లు
తమిళనాడు – 5.55 కోట్లు
నార్త్ ఇండియా – 66.55 కోట్లు
ఓవర్సీస్ – 31.18 కోట్లు
————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 196.76 కోట్లు (షేర్)
————————————————————–
‘సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి 196.76 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 94 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో ఈ చిత్రం పెర్ఫార్మన్స్ చాలా పడిపోయింది. అయితే హిందీలో మాత్రం బాగానే రాణిస్తుంది. ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఈ శుక్రవారం నుండీ ఆదివారం వరకూ మళ్ళీ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఎంతకాదనుకున్నా 200 కోట్ల వరకూ షేర్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని ‘సాహో’ ఎంత వరకూ ఉపయోగించుకుంటాడో చూడాల్సి ఉంది.