‘సాహో’ సాంగ్ షూటింగ్ ఎక్క‌డో తెలిస్తే షాకే..!

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్.. ప్రభాస్ కు జంట‌గా నటిస్తుంది. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 95 శాతం షూటింగ్ పూర్తయ్యిందట. ఇక ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఆస్ట్రియా దేశంలో పాట‌ల చిత్రీక‌ర‌ణ జరుగుతుందట.

ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా కపూర్ ల పై ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారట. ఈ సాంగ్ సినిమాలో హైలెట్ గా ఉంటుందట. థియేటర్లలో ప్రేక్షకులు ఈ పాటని బాగా ఎంజాయ్ చేస్తారని యూనిట్ సభ్యుల సమాచారం. ఇక ‘సాహో’ చిత్రం ఆగష్టు 15 న విడుదల కానుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ కు యునానిమస్ గా మంచి రెస్పాన్స్ రావడంతో.. అంచనాలు మరింత బలపడ్డాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus