మొత్తానికి ‘సాహో’ శాటిలైట్ రైట్స్ కు భారీ రేటు దక్కింది..!

  • April 10, 2020 / 08:24 PM IST

‘బాహుబలి'(సిరీస్) తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండీ వచ్చిన చిత్రం ‘సాహో’. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. తెలుగు తో పాటు హిందీ, తమిళ , మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేసారు. అయితే ఒక్క బాలీవుడ్ లో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అక్కడ 126 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది.

తెలుగులో 120 కోట్లకు అమ్మితే 80 కోట్లు మాత్రమే రాబట్టింది. ఓవర్ ఆల్ గా ఈ చిత్రానికి 290 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే 230 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ గా నిలిచింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 130 కోట్ల వరకూ రావడంతో నిర్మాతలు సేఫ్ అయిపోయారు. కానీ హడావిడి గా రిలీజ్ చెయ్యడం వల్ల శాటిలైట్ రైట్స్ ను హిందీ మినహా అమ్మ లేదు. తాజాగా ‘సాహో’ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడైనట్టు సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు… తెలుగు వెర్షన్ 12 కోట్లకు అమ్ముడు కాగా మిగిలిన భాషలు అన్నీ కలిపి మరో 8 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. మొత్తంగా ‘సాహో’ చిత్రానికి శాటిలైట్ రైట్స్ రూపంలో ఓ 20 కోట్లు దక్కాయి. సినిమా రిజల్ట్ ప్లాప్ అని తెలిసినా ఇంత పెద్ద మొత్తం ముట్టడం అంటే మాటలు కాదు. ఇక ఎలాగూ లాక్ డౌన్ ఉంది కాబట్టి ఈ టైములో టెలికాస్ట్ చేస్తే మంచి రేటింగ్ వచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus