ఆకట్టుకుంటున్న సాహో వీఎఫెక్స్ బ్రేక్ డౌన్ టీజర్

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో టీజర్ ఏప్రిల్ 27 న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. 12 మిలియన్ పైగా వ్యూస్ అందుకొని దూసుకుపోతోంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరిచింది. ఈ పని వెనుక పడిన కష్టాన్ని చిత్ర బృందం బయటపెట్టింది. ఈ టీజర్ సీజీఐ వర్క్ ని సాహో వీఎఫెక్స్ బ్రేక్ డౌన్ పేరిట వీడియోని రిలీజ్ చేసింది. 1 .26 నిముషాల ఈ వీడియో ఆశ్చర్యపరుస్తోంది. ఫ్లూయిడ్ మాస్క్ అనే సంస్థ ఈ  సీజీఐ వర్క్ ని చేసినట్లుగా స్పష్టం చేసింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమయింది.

ఇందులో ప్రభాస్, ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహో వీఎఫెక్స్ బ్రేక్ డౌన్ వీడియోని ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ ఏకకాలంలో మూడు భాషల్లో రూపుదిద్దుకోనుంది. బాలీవుడ్ నటి  శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus