ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల కోరిక తీరింది..!

‘బాహుబలి’ వంటి భారీ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రం కూడా 200 కోట్ల భారీ బడ్జెట్ తోనే రూపొందుతుంది. బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన రెండు మేకింగ్ వీడియోలను విడుదల చేసారు. వీటితో పాటూ ప్రభాస్… శ్రద్దా కు సంబందించిన పిక్స్ కూడా బయటకి వచ్చాయి. కానీ ఇద్దరూ కలిసి ఉన్న పిక్ మాత్రం ఇప్పటి వరకూ బయటకి రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ జంట కలిసున్నా పిక్ బయటకొస్తుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు వారి కోరిక తీరింది. ప్రభాస్, శ్రద్దా కలిసున్న ఓ పిక్ తాజాగా బయటకొచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ‘సాహో’ చిత్ర యూనిట్ ప్రస్తుతం ముంబైలోని కర్జత్ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో శ్రద్ధా కపూర్ తో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటుంది. పోస్ట్ ఇంటర్వెల్ లో వచ్చే కొన్ని సీన్స్ తో పాటూ ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా తెరకెక్కిస్తున్నారట. ఆ షూటింగ్ స్పాట్ కి బిజెపి మంత్రి నితిన్ గడ్కరి విచ్చేశాడు. ఇందులో భాగంగా ప్రభాస్ తో ఓ ఫోటో కూడా దిగారు. ఈ ఫొటోలో ప్రభాస్ తో పాటూ శ్రద్దా కపూర్… అలాగే మిగిలిన నటీ నటులు, యూనిట్ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇక ‘సాహో’ చిత్రం ఆగష్టు 15 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus