యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినిమాలు అన్నీ రిచ్ గా ఉండేలా చూసుకుంటాడు. అందుకే అతని సినిమాలో ఆకట్టుకునే కథ లేకపోయినా రెండున్నర గంటలపాటు కనువిందు చేస్తుంది. ప్రేక్షకులను సీట్లో కూర్చోబెడుతోంది. యువ డైరక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో అతను చేసిన మూవీ సాక్ష్యం శనివారం థియేటర్లోకి వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. మినీ బాహుబలి గా ఉందని “a” సెంటర్స్ ఆడియన్స్ విమర్శిస్తుంటే.. బీ సి సెంటర్స్ లో మాత్రం ఈ చిత్రం హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధిస్తోంది. సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు పంచభూతాలు సాక్ష్యాలే అనే కాన్సెప్ట్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా ఇరగదీసిన ఈ చిత్రం హిట్ దిశగా దూసుకుపోతోంది. దీంతో శాటిలైట్ హక్కులకు సహజంగానే డిమాండ్ పెరిగిపోయింది. రైట్స్ సొంతం చేసుకోవడానికి వివిధ ఛానల్స్ పోటీ పడ్డాయి. 40 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ సినిమాకి కేవలం శాటిలైట్ హక్కుల రూపంలోనే 13 కోట్ల వరకూ వచ్చిన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. తెలుగు శాటిలైట్ రైట్స్ నిమిత్తం 8 కోట్లను .. హిందీ శాటిలైట్ హక్కుల నిమిత్తం 5 కోట్లను రాబట్టింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో ఈ స్థాయిలో శాటిలైట్ హక్కులు అమ్ముడవడం ఇదే తొలిసారి అని తెలిసింది.