జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ‘సాక్ష్యం’

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. సినిమా టీజర్ ప్రేక్షకుల్లో కథపై క్రేజ్ ను, అంచనాలను పెంచింది. యూట్యూబ్ లో ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ క్రేజీ యాక్షన్ ఫిలిమ్ ను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. “ఈ సినిమాతో అందరూ శ్రీవాస్ లోని కొత్త యాంగిల్ ను చూస్తారు. సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కి ప్రకృతిని కేంద్రబిందువుగా చేసుకొని శ్రీవాస్ రాసుకొన్న స్క్రీన్ ప్లే సినిమాకి హైలైట్ గా నిలిస్తుంది. ఇటీవలే అమెరికా షెడ్యూల్ పూర్తయ్యింది. దుబాయ్, వారణాసి, అమెరికాలోని ఎగ్జాటిక్ లొకేషన్స్ లో షూటింగ్ ఫినిష్ చేశాం. ఇవాల్టినుంచి రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ ఫినిష్ అయినట్లే. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసి జూన్ 14న ప్రేక్షకులకు సినిమాను అందిస్తాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మేకోవర్, టెక్నికల్ అంశాలు, వి.ఎఫ్.ఎక్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే విధంగా సినిమా ఉంటుందని గర్వంగా చెప్పగలను” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus