కొంత గ్యాప్ తర్వాత ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా నటించిన సినిమా ‘శబ్దం’ (Sabdham) . 14 ఏళ్ళ తర్వాత ‘వైశాలి’ దర్శకుడు అరివళగన్ (Arivazhagan Venkatachalam) తో హీరో ఆది చేసిన సినిమా ఇది. తమన్ (S.S.Thaman) సంగీతం అందించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కి మంచి టాక్ వచ్చింది. హర్రర్ టచ్ ఉన్న సినిమా కావడంతో.. మొదటి నుండి దీనిపై ఆడియన్స్ ఫోకస్ ఉంది. ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.
ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదు అని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడం గమనార్హం. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.11 cr |
సీడెడ్ | 0.06 cr |
ఆంధ్ర(టోటల్) | 0.13 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.30 cr |
‘శబ్దం’ సినిమాకి తెలుగులో రూ.1.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.30 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.46 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. శని, ఆదివారాల్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుందేమో చూడాలి.