Shilpa Shetty: రాజ్ కుంద్రా,శిల్పా శెట్టి దంపతులకు పెద్ద షాకిచ్చిన సచిన్ జోషి..!

Advertisement

ఇటీవల అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుండీ అతను ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు అతనికి మరో షాక్ తగిలింది. సత్యయుగ్‌ గోల్చ్ స్కీమ్‌ కేసులో రాజ్‌కుంద్రా పై ప్రముఖ హీరో సచిన్‌ జోషి విజయం సాధించడం విశేషం.వివరాల్లోకి వెళ్తే… రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యయుగ్ గోల్డ్ బంగారు పథకంలో సచిన్ ను మోసం చేశారని ఆరోపిస్తూ అతను ఈ ఏడాది జనవరిలో కేసు పెట్టాడు.

తాజాగా కోర్టు సచిన్ జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది.అతనికి చెందాల్సిన కిలో బంగారాన్ని అప్పగించింది. అంతేకాకుండా కోర్టు ఖర్చుల క్రింద మూడు రూ.3 లక్షల రూపాయలను చెల్లించాలని ముంబై హైకోర్టు రాజ్‌కుంద్రాని ఆదేశించింది. ఈ విషయం పై సచిన్‌ జోషి స్పందిస్తూ…. ‘6 ఏళ్ళ నుండీ ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుని అన్యాయంగా కాజేయాలని చూశారు. రూ.18 లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వడానికి రూ.25 లక్షలు డిమాండ్‌ చేసింది కుంద్రా సంస్థ.

నా బంగారాన్ని నాకు ఇచ్చేయమని కోరితే రివర్స్‌లో నా పైనే బురద చల్లారు. చేసిన పాపాలు ఎక్కడికిపోతాయి…కర్మ అనుభవించక తప్పదు.నేనొక్కడినే కాదు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు’ అంటూ అతను పేర్కొన్నాడు. మొత్తానికి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లకి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. అంతేకాకుండా కుంద్రాని రిమాండ్‌ లో మరో 3 రోజుల పాటు ఉంచబోతున్నారని తెలుస్తుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus