‘ఎన్టీఆర్’ లో కీలకపాత్ర పోషించనున్న హిందీ నటుడు

మహానటుడు నందమూరి తారకరామారావు జీవితంపై తెరకెక్కించాలనుకున్న మూవీ అనుకున్న దానికన్నా ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందుకే అభిమానుల అంచనాలకు మించి బయోపిక్ ఉండాలని డైరక్టర్ క్రిష్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించనున్న ఈ సినిమాలో అనేకమంది స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషించనుంది. అలాగే ఎన్టీఆర్ అల్లుడు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గా రానా కనిపంచనున్నారు. అందుకు తగ్గట్టు రానా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తాజాగా మరో రోల్ కి నటుడిని ఫిక్స్ చేశారు.

ఎన్టీఆర్ జీవితంలో మాజీ ముఖ్యమంత్రి నాదండ్ల భాస్కరరావు పాత్ర ముఖ్యమైనది. ఇప్పుడు ఆ పాత్ర కోసమే దర్శకనిర్మాతలు ప్రముఖ హిందీ నటుడు సచిన్ కెడెకర్ ను తీసుకున్నారు. జూలై 5 నుంచి తొలి షెడ్యూల్ మొదలు కానుంది. పదిహేను రోజులు పాటు సాగనున్న ఈ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో, రామకృష్ణ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో జరగనుంది. బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న సినిమాకి బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తుండగా… ఎం.ఎం. కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. ఈ సినిమాని అత్యంత వేగంగా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus