Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

బాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా మన ఇతిహాసం రామాయాణాన్ని సినిమా మరోసారి తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది ప్రయత్నాలు కొబ్బరికాయ ముందే ఆగిపోగా.. నిర్మాత నమిత్‌ మల్హోత్రా ప్రయత్నం దానిని దాటి.. ఒక పార్టుకు గుమ్మడికాయ కొట్టేంతవరకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే.. ఆయన కాస్టింగ్‌ను విమర్శించడం మొదలుపెట్టారు. ఆ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటించడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు.

Sadguru

ఈ మేరకు రణ్‌బీర్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా వీటిపై ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ స్పందించారు. ‘రామాయణ’ సినిమా నిర్మాత నమిత్‌ మల్హోత్రాకు సద్గురు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే రణ్‌బీర్‌ గురించి, పాత్ర ఎంపిక గురించి మాట్లాడారు. రణ్‌బీర్‌ను ట్రోల్ చేయడం అన్యాయం. గతంలో రణ్‌బీర్‌ చేసిన పాత్రలకు, ఇప్పుడు చేస్తున్న పాత్రకు ముడిపెట్టడం సరికాదు. భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి తెలియదు కదా అని సద్గురు ప్రశ్నించారు.

‘రామాయణ’ సినిమా తర్వాత ఇంకో సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రావణుడిగా నటించొచ్చు. అప్పుడు కూడా ఇలానే ‘రాముడిగా చేసినోడు రావణుడు అవ్వడం ఏంటి?’ అని ట్రోల్స్‌ చేస్తారా. అలా చేయడం పద్ధతి కాదు అని సద్గురు అన్నారు. ఈ సందర్భంగా ‘రామాయణ’లో నటిస్తున్న మరో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ గురించి మాట్లాడారు. ఆయన ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికాన్ని క్యాన్సర్‌ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇచ్చినట్లు తెలిపిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మొదటి పార్ట్‌కు షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు వారిపై ఎలాంటి ట్రోల్స్‌ రావడం లేదు.

చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus