Director Sagar: ఆ గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చిన భీమ్లా డైరెక్టర్!

భీమ్లా నాయక్ సినిమాతో దర్శకుడు సాగర్ కె చంద్ర ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందు సాగర్ కె చంద్ర గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. త్రివిక్రమ్ భీమ్లా నాయక్ డైరెక్షన్ లో వేలు పెట్టారని భీమ్లా నాయక్ కు మాటల మాంత్రికుడు ఘోస్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే భీమ్లా నాయక్ సక్సెస్ తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సాగర్ కె చంద్ర ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన సినీ కెరీర్ లో తొలి భారీ బ్లాక్ బస్టర్ హిట్ భీమ్లా నాయక్ అని సాగర్ కె చంద్ర తెలిపారు. లాడ్జ్ ఫైట్ కు ముందు వచ్చే ఎంట్రీ సీన్ పవన్ పై తెరకెక్కించిన ఫస్ట్ షాట్ అని సాగర్ కె చంద్ర పేర్కొన్నారు. పవన్ బుల్లెట్ పై వచ్చే షాట్స్ ను తెరకెక్కించి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సెట్ లో సీన్లు తీశామని సాగర్ కె చంద్ర వెల్లడించారు. తాను ఈ సినిమాకు దర్శకుడిగా పని చేశానని స్క్రీన్ ప్లే క్రెడిట్ త్రివిక్రమ్ కు దక్కుతుందని సాగర్ అన్నారు.

భీమ్లా నాయక్ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మార్పులు చేశారని సాగర్ తెలిపారు. రానా భార్యను, తండ్రిని ఒకేసారి పరిచయం చేయడం కోసం ప్రెయిర్ ను వాడుకున్నానని సాగర్ చెప్పుకొచ్చారు. నా అవుట్ పుట్ సరిగ్గా రాకపోవడంతో త్రివిక్రమ్ సెట్స్ లోకి వచ్చారని జరిగిన ప్రచారంలో నిజం లేదని సాగర్ కామెంట్లు చేశారు. భీమ్లా నాయక్ తొలిరోజు షూటింగ్ నుంచి త్రివిక్రమ్ సెట్ లో ఉన్నారని రీషూట్లు అనేవి కామన్ అని ఆయన అన్నారు.

తాను తెరకెక్కించిన సీన్లను పూర్తిగా పక్కన పడేసిన సందర్భాలు మాత్రం లేవని సాగర్ చెప్పుకొచ్చారు. డైరెక్షన్ లో త్రివిక్రమ్ కలుగజేసుకోలేదని ఫ్రేమ్స్ సరిగ్గా పెట్టకపోతే మాత్రం చూసుకో అని త్రివిక్రమ్ చెప్పేవారని సాగర్ వెల్లడించారు. యాక్టర్ల డైలాగ్ డెలివరీని మాత్రం త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకునేవారని సాగర్ చెప్పుకొచ్చారు. సాగర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాగర్ తర్వాత సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus