లవ్‌, యాక్షన్‌ కలగలిసిన సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ – మంజిమ మోహన్‌

నాగచైతన్య, మంజిమ మోహన్‌ జంటగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్‌పై గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ జంటగా మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమా నవంబర్‌ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ మంజిమ మోహన్‌తో ఇంటర్వ్యూ….

‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?  నేను చైల్డ్‌ ఆర్టిస్ట్‌ను హీరోయిన్‌గా నేను నటించిన తొలి సినిమా ‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’ ఈ సినిమా ట్రైలర్‌ చూసిన గౌతమ్‌మీనన్‌గారికి నేను నచ్చడంతో ఆయన నన్ను ఆడిషన్‌కు రమ్మని పిలిచారు. ఆడిషన్‌లో నేను సెలక్ట్‌ అయ్యాను. ముందు నన్ను తమిళ సినిమా కోసం ఆడిషన్‌ చేశారనుకున్నాను. అయితే గౌతమ్‌మీనన్‌గారు తెలుగు, తమిళంలో సినిమా చేస్తున్నామని చెప్పగానే నేను భాష పరంగా సమస్య ఉంటుంది కాబట్టి నేను చేయలేనని అన్నాను. ఏం పర్వాలేదు…నువ్వు చేయగలవ్‌ నన్ను నమ్ము అన్నారు. ఆయనపై నమ్మకంతో నేను సినిమా చేయడానికి అంగీకరించాను.

తెలుగులో నటించిన ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది? – మంచి అనుభవం అనే చెప్పాలి. ముందు నాకు తెలుగు ఓ ఏలియన్‌ భాషగా తోచేది. కానీ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేయడం వల్ల ఇప్పుడు కొంత అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను మలయాళీ, తమిళం మాట్లాడటం వచ్చు.

ఒకే సినిమాను వేర్వేరు హీరోలతో చేయడం ఎలా అనిపించింది? – వేర్వేరు హీరోలతో ఒకే సినిమా చేయడం ఇబ్బందిగా అనిపించలేదు కానీ ఒకే సీన్‌ను వేర్వేరుగా చేయడం ఇబ్బందిగా ఫీలయ్యాను. ఇద్దరు హీరోలు బాగా సపోర్ట్‌ చేశారు. నాగచైతన్య నాకు షూటింగ్‌ ముందే రోజు తెలుగు నేర్పించేవారు. నేను తెలుగు డైలాగ్స్‌ నేర్చుకుని చేసేదాన్ని.

మీ ఫ్యామిలీని ఎలా ఒప్పించారు..? – నాన్న మలయాళ సినిమాల్లో సినిమాటోగ్రాఫర్‌. ఓ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అవసరం కావడంతో నాన్నగారు నన్ను నటించమని అడిగారు. అలా ఇండస్ట్రీలోకి చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టాను. హీరోయిన్‌ కావాలనుకోగానే నాన్నకు చెప్పాను. అయితే ఆయన ముందు చదువు పూర్తి చేయమని అన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత నాన్న ఒప్పుకున్నారు. నాన్నకు ఇండస్ట్రీ అంటే అవగాహన ఉండటంతో పెద్దగా కష్టపడలేదనే అనాలి. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎనిమిది సినిమాలు నటిస్తే, హీరోయిన్‌గా మలయాళంలో ఒక సినిమా చేశాను. తెలుగు, తమిళంలో ఒక సినిమా చేశాను.

నాగచైతన్యతో పనిచేయడం ఎలా అనిపించింది? – నాగచైతన్య చాలా మంచి కోస్టార్‌. సెట్స్‌లో తనుంటే నన్ను కంఫర్ట్‌గా ఉంచేవాడు. వాతావరణాన్ని జోవియల్‌గా ఉంచేవాడు. డైలాగ్స్‌ విషయంలో నాకు బాగా సపోర్ట్‌ చేశాడు. సీన్‌ను ఎలా చేయాలో డిస్కస్‌ చేసేవాడేవాడు. రొమాంటిక్‌ సీన్స్‌ చేయడంలో నేను వీక్‌ అనే చెప్పాలి. ఇబ్బంది పడేదాన్ని..ఆ సమయంలో చైతు టిప్స్‌ చెప్పాడు. నేను ఎక్కడా ట్రైనింగ్‌ తీసుకోలేదు. షూటింగ్‌ సమయంలో చైతు, శింబు, గౌతమ్‌ మీనన్‌గారు, డైరెక్షన్‌ టీం బాగా సపోర్ట్‌ చేసింది.

క్యారెక్టర్‌ గురించి చెప్పండి? – సినిమాలో లీలా అనే సింపుల్‌ గర్ల్‌ పాత్రలో కనపడతాను. చైతన్య ఫ్రెండ్‌ చెల్లెలు పాత్రలో కనపడతాను. ఫస్టాఫ్‌ అంతా లవ్‌ ఫీల్‌తో ఉంటే, సెకండాఫ్‌ థ్రిల్లింగ్‌ యాక్షన్‌ మోడ్‌లో ఉంటుంది.

సినిమా విడుదల్లో ఆలస్యం అయ్యింది కదా..ఎలా అనిపించింది? – నిజానికి సినిమా విడుదల ఆలస్యం అయినప్పుడు కాస్తా ఒత్తిడికి గురైయ్యాను. అయితే గౌతమ్‌మీనన్‌గారు మంచి సినిమా, అవుట్‌ పుట్‌ కావాలంటే సహనం ఉండాలని అనేవారు. రెండు భాషల్లో సినిమా తెరకెక్కేటప్పుడు కొన్ని సమస్యలుంటాయని వెయిట్‌ చేయాలని గౌతమ్‌గారు వివరించారు.

తెలుగు సినిమాలు చూస్తారా? – లేదండి..పెద్దగా చూసేదాన్ని కాదు… అయితే చిరంజీవిగారు, నాగార్జునగారు, అల్లుఅర్జున్‌ గురించి తెలిసేది. ఎందుకంటే వీరి సినిమాలు మలయాళంలో డబ్‌ అయ్యేవి. తెలుగు సినిమాలో యాక్ట్‌ చేయడం మొదలు పెట్టాక ఏ మాయ చేశావే, మనం సినిమాలను చూశాను. అలాగే నేను శైలజ సినిమా కూడా చూశాను. నేను అందరితో స్నేహంగానే ఉంటాను. పర్టిక్యులర్‌గా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటూ ఎవరూ లేరు.

హీరోయిన్‌ అయిన తర్వాత మీ నాన్నగారు ఏమన్నారు? – సాహసం శ్వాసగా సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్‌ సీన్‌ చూసి నేను ఏడ్చేశాను. ఆ సమయంలో నాన్నగారు నన్ను చూసి ఏడ్చేశారు. అప్పుడు నేను నా నటన పట్ల నాన్న సంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకున్నాను. అంతే తప్ప ఎప్పుడూ నాన్న ఇలా చేయాలి..అలా చేయాలని చెప్పలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus