రేపు సాహో అప్డేట్ కోసం వేచి చూడండి: ప్రభాస్

ఇదివరకు ఇద్దరు సినిమా లవర్స్ ఒక దగ్గర కూర్చున్నారంటే ప్రభాస్ గురించే మాట్లాడుకొనేవారు. “బాహుబలి”తో ప్రభాస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కానీ.. ఈమధ్య ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక దగ్గర కూర్చున్నా కూడా ప్రభాస్ గురించి కానీ.. ప్రభాస్ కొత్త సినిమా గురించి కానీ మాట్లాడుకోవడం లేదు. అందుకు కారణం “సాహో” షూటింగ్ మొదలై రెండేళ్లు పూర్తికావస్తున్నా టీజర్ ఆ తర్వాత వచ్చిన షేడ్స్ ఆఫ్ సాహో తప్ప సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు. దాంతో సాహో గురించి ఏం మాట్లాడుకోవాలో తెలియక సైలెంట్ అయిపోయారు ప్రభాస్ అభిమానులందరూ.

కట్ చేస్తే.. గత కొన్ని నెలలుగా అభిమానులు ఆశగా ఎదురుచూసి చూసీ ఇక నమ్మకం కోల్పోయిన విషయం “సాహో అప్డేట్”. షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోలు, వాళ్ళు బయట ఎక్కడైనా కనిపించగా వచ్చిన ఫోటోలు తప్ప కనీసం సినిమా స్టిల్స్ కూడా రిలీజ్ చేయలేదు. మరి అభిమానుల కల నెరవేర్చడం కోసమో లేక రిలీజ్ దగ్గర పడుతుందని గ్రహించాడో తెలియదు కానీ.. “హెలో డార్లింగ్స్, రేపు మంచి అప్డేట్ వస్తుంది, నా ఇన్స్టాగ్రామ్ లో” అని ఒక వీడియో మెసేజ్ పంపాడు ప్రభాస్. దాంతో నిన్నమొన్నటివరకూ వనవాసం చేస్తున్న ప్రభాస్ అభిమానులందరూ ఒక్కసారిగా బయటకొచ్చారు. మరి రేపు ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తాడా లేక సినిమాలోని తన స్టిల్ ఏదైనా రిలీజ్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus