అబుదాబి షూటింగ్ ఫోటోలు లీక్ పై బాధపడుతున్న సాహో టీమ్

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపై అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సారి ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమని మరో మెట్టుకు తీసుకుపోతాడని నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అత్యంత సాహసమైన ఛేజింగ్ సీన్ లను డూప్ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లోని అత్యంత రద్దీ ప్రాంతాలుగా పేరుగాంచిన బుర్జ్ ఖలీఫా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇతిహాద్ టవర్(అబుదాబి) ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సన్నివేశాన్ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ కి సంబంధించిన మేకింగ్ ఫోటోలు బయటికి రాకుండా ఉండాలని ప్రత్యేక బృందాన్ని సుజీత్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రెండు రోజుల క్రితం ప్రభాస్ బైక్ పై ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో చిత్ర బృందం చాలా బాధపడుతోంది.

కీలకమైన సీన్ గురించి ముందుగా తెలిసిపోతే ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇక నుంచి అయినా ఇటువంటి లీకులు జరగకుండా ఉండాలని మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. టీ సిరీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus