Vishwambhara: ‘విశ్వంభర’లో బావామరదళ్లు.. వశిష్ట ప్లానేంటి? ఇంకెవరు నటిస్తారు?

Ad not loaded.

నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా టీమ్‌ ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్‌ అయిపోయింది. సినిమాకు సంబంధించి అఫీషియల్‌ అప్‌డేట్‌లు, అన్‌ అఫీషియల్‌ అప్‌డేట్లు / లీక్‌లు తెగ వచ్చేస్తున్నాయి. సినిమాలో చిరంజీవి (Chiranjeevi) ఇంట్రడక్షన్‌ సాంగ్‌ తెరకెక్కిస్తున్నాం అని ఓ అఫీషియల్‌ అప్‌డేట్‌ రాగా, సినిమాలో సాయి తేజ్‌ (Sai Dharam Tej) నటిస్తున్నాడు అని లీక్‌లు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది. సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ వాయిదా పడటంతో కాస్త గ్యాప్‌ తీసుకొని మళ్లీ ఫుల్‌ జోష్‌తో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు చిరంజీవి.

Vishwambhara

దీంతో అప్‌డేట్స్‌ కూడా బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లూ పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్లు కూడా తిరిగి యాక్టివేట్ అయ్యారు. సాయితేజ్‌ కేమియో గురించి వార్త ఓవైపు వైరల్‌ అవుతుండగానే మరో మెగా ఫ్యామిలీ మెంబర్‌ సినిమాలో ఉందనే పుకారు బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో కీలక అతిథి పాత్రల్లో సాయితేజ్‌ – నిహారిక (Niharika) కనిపించబోతున్నారట.

ఈ ఇద్దరూ ఇంట్రో సాంగ్‌లో కనిపిస్తారు అని కొందరు చెబుతుంటే..కాదు కాదు కొన్ని సీన్స్‌ కూడా ఉన్నాయి అని చెబుతున్నారు. వాళ్లు ఉన్న విషయం లీక్‌ ద్వారా బయటకు వచ్చింది. అలాగే పాత్ర గురించి త్వరలో తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఇద్దరూ కలసి నటిస్తారా? లేక వేర్వేరుగా సినిమాలోకి ఎంట్రీ ఇస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా సంగతి చూస్తే.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా రేంజిలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వశిష్ట (Mallidi Vasishta). దీని కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను సైతం రప్పించారు. అయితే టీజర్‌లో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో అభిమానులు పెదవి విరిచారు. ఇప్పుడు దానిని సరిదిద్దుకునే పనులు కూడా టీమ్‌ చేపట్టింది. ఇక ఈ సినిమాను చిరంజీవికి బాగా అచ్చొచ్చిన మే 9న రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారు. మరి అప్పటికి సినిమా పూర్తవుతుందా అనేది కూడా చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus