సాయి ధరమ్ తేజ్ కోసం నిర్మాతగా అవతారమెత్తనున్న డైరక్టర్ బాబీ.!

పవర్ సినిమాతో బాబీ డైరక్టర్ గా పరిచయమయ్యారు. తొలి సినిమాతో హిట్ కొట్టి స్టార్ డైరక్టెర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ బాబీకి షాక్ ఇచ్చింది. దీంతో అతను మళ్లీ కష్టపడి.. మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని.. ఎన్టీఆర్ తో జై లవకుశ తెరకెక్కించారు. తారక్ ని మూడు పాత్రల్లో చూపించి అటు కలక్షన్స్ ని , ఇటు అభినందనలని అందుకున్నారు. ప్రస్తుతం బాబీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు. ఓ వైపు ఈ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటూనే నిర్మాతగా అవతారమెత్తనున్నారు.

సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమాని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ నుంచి డైరెక్టర్‌గా మారిన అరుణ్ పవార్ ‘బెస్ట్ యాక్టర్స్’, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాలతో పరవాలేధనిపించారు. అతను సాయి ధరమ్ తేజ్ కి రీసెంట్ కథ చెప్పారని, అందుకు తేజ్ ఓకే చెప్పారని సమాచారం. ఆ కథ బాబీకి కూడా నచ్చడంతో నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాబీ, అరుణ్ పవార్ ప్రాజక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus