చినమావయ్య కోసం సాయిధరమ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా?

అనుకున్న ప్రకారం ముందు విడుదలవ్వకపోయినా తాను కథానాయకుడిగా కెరీర్ మొదలెట్టడానికి ముఖ్యకారకుడైన చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ మీద అపారమైన అభిమానమో ఏమో కానీ.. పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ లు తీసుకొని చేయలేకపోయిన సినిమాలను పూర్తి చేయాలని సాయిధరమ్ తేజ్ ఫిక్సయ్యాడు. అందులో భాగంగానే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో “చిత్రలహరి” చిత్రం చేస్తున్న సాయిధరమ్ తేజ్ ఇప్పుడు మరో సినిమా సైన్ చేశాడట. అది కూడా పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కోసమే.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సాయిధరమ్ తేజ్ ఇప్పుడు ఏ.ఎం.రత్నం నిర్మాణంలో ఒక సినిమా సైన్ చేశాడట. నిజానికి కాటమరాయుడు అనంతరం పవన్ కళ్యాణ్ తో ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఒక సినిమా ఋపొందించేందుకు రత్నం కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చారు. కానీ.. పవన్ సడన్ పోలిటికల్ డెసిషన్ తో సినిమాలకు దూరమవ్వడంతో.. ఆ అడ్వాన్స్ కి బదులుగా సాయిధరమ్ తేజ్ సినిమాలు చేస్తున్నాడు. ఏదైనా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన పవన్ కోసం సాయిధరమ్ తేజ్ చేస్తున్న రిస్క్ కి మెగా ఫ్యాన్స్ అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus