తేజూ.. అనవసరంగా కమిట్ అవుతున్నాడా…?

మెగా మేన‌ళ్ళుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ గత రెండేళ్ళుగా వ‌రుస ప్లాపులతో సతమవుతున్నాడు. ఇంచుమించు అర‌డ‌జ‌ను ప్లాపులతో రేస్లో వెనుకబడ్డాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల‌నే ఉద్దేశంతో.. ఇప్పుడు మినిమం గ్యారెంటీ ఉన్న డైరెక్ట‌ర్… ‘నేను శైల‌జ’ ఫేం కిషోర్ తిరుమ‌ల డైరెక్షన్లో ‘చిత్ర‌ల‌హ‌రి’ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తాజాగా తేజు ఓ రీమేక్ చిత్రం చేయబోతున్నాడంట.

విషయంలోకి వెళితే ఇటీవ‌ల విడుద‌లయ్యి సూపర్ హిట్టయిన బాలీవుడ్ మూవీ ‘గ‌ల్లీ బాయ్’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు వ‌ర్షం కురిపిస్తుండ‌డ‌మే కాకుండా, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి రంగం సిద్ధమయ్యిందట. ఇప్పటికే ఈ చిత్రం రీమేక్ హ‌క్కులని గీతా ఆర్ట్స్ దక్కించుకుందట. ఈ చిత్రాన్ని సాయి ధ‌ర‌మ్ తేజ్ తో తెరకెక్కించబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘సాయి ధ‌రమ్ తేజ్‌కు మ‌రో ప్లాప్ రావడం కాయం’… అంటూ కొందరు నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనికి కారణాన్ని పరిశీలిస్తే… ‘గల్లీ బాయ్’ చిత్రం హిట్టవ్వడానికి ర‌ణ్‌వీర్ సింగ్ న‌ట‌న‌, జోయా అక్త‌ర్ డైరెక్షన్ ప్రధాన కారణం. ఒక గ‌ల్లీ కుర్రాడిగా ర‌ణ్‌వీర్ మంచి నటన కనబరిస్తే… అద్భుతమైన ఎమోషన్స్ పండించాడు డైరెక్టర్ జోయా అక్తర్.

దీంతో ‘గ‌ల్లీబాయ్’ చిత్రం రొటీన్ కథే అయినా విజ‌యాన్ని సాధించింది. అయితే తెలుగులో జోయా అక్త‌ర్ రేంజ్‌లో ఈ కథను డీల్ చేసే డైరెక్ట‌ర్ చేతిలో ఈ సినిమా కచ్చితంగా ప‌డాల్సి ఉంది.. అలాగే ఇప్ప‌టి వరకూ చెప్పుకోద‌గ్గ న‌ట‌న తేజూ కనబరచలేదు… ఏదో డ్యాన్సుల్లోనూ, ఫైట్ల లోనూ చిరంజీవి పవన్ కళ్యాణ్ లను ఇమిటేట్ చేస్తూ వెళ్ళిపోతాడు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండనే ఉంది. ఈ కారణంగానే సోష‌ల్ మీడియాలో ఇలా కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ‘గీత ఆర్ట్స్’ లాంటి సక్సెస్ ఫుల్ సంస్థ ఈ రీమేక్ ను తెరకెక్కిస్తోంది కాబట్టి.. ఏదో ఒక రకంగా ఈ చిత్రాన్ని సక్సెస్ వైపు నడిపించే అవకాశాలు కూడా ఉన్నాయని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus