Sai Dharam Tej: బ్రేకప్ కూడా జరిగింది.. అప్పుడే పెళ్లి చేసుకుంటా!

మెగా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈయన విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ సినిమా 21వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ప్రమాదం తర్వాత ఈయన నటించిన మొదటి సినిమా కావడంతో ఈ ఇంటర్వ్యూలలో తన ప్రమాదం గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఇకపోతే సాయి తేజ్ పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈయన పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఎవరో అంటున్నారు కదా అని నేను పెళ్లి ఇప్పుడే చేసుకోనని నాకు నచ్చినప్పుడే నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానంటూ తెలియచేశారు. ఇక తన లైఫ్ లో ఉన్నటువంటి బ్రేకప్స్ గురించి కూడా ఈయన మాట్లాడారు. తనకు ఓ అమ్మాయితో బ్రేకప్ జరిగిందని సాయి తేజ్ వెల్లడించారు. ఇలా ఆ అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిలు అంటేనే తనకు భయం వేస్తుందని తెలిపారు.

ఇలా పెళ్లి గురించి తన బ్రేకప్ గురించి (Sai Dharam Tej) సాయిధరమ్ తేజ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక విరూపాక్ష సినిమా విషయానికి వస్తే కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా క్రైమ్ త్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. మరి సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus