మారుతి డైరెక్షన్లో తేజు చిత్రం..?

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. ‘తిక్క’ ‘విన్నర్’ ‘నక్షత్రం’ ‘జవాన్’ ‘ఇంటిలిజెంట్’ ‘తేజ్ ఐ లవ్ యు’ ఇలా అరడజను ప్లాపులు రావడంతో.. తన తరువాత చేయబోయే సినిమాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కిశోరె తిరుమల డైరెక్షన్లో ‘చిత్ర లహరి’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంతో కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో చాలా కష్టమవుతున్నాడట. ఈ చిత్రం తరువాత ఓ క్రేజీ డైరెక్టర్ తో తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.

ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరో కాదు… మన మారుతినే..! ప్రస్తుతం తేజు – మారుతీ కాంబినేషన్లో ఓ చిత్రం సెట్స్ పైకి వెళ్ళడానికి రంగం సిద్ధమయ్యిందట. ‘గీతా ఆర్ట్స్’ రెండో బ్యానర్ అయిన ‘జి.ఏ 2 పిక్చర్స్’ బ్యానర్ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. మొదట ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో చేయాలని భావించినప్పటికీ … వరుస కమిట్మెంట్స్ తో నాని బిజీగా ఉండడంతో తప్పుకున్నాడట. దీంతో తేజుతో కలిసి సెట్స్ పైకి వెళ్ళడానికి మారుతి రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. మారుతి గత చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో తేజుతో ఓ ‘సాలిడ్’ హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus