Sai Dharam Tej: వరుణ్ పెళ్లి ఎఫెక్ట్ సాయి ధరమ్ తేజ్ పెళ్లికి ఒత్తిడి!

మెగా ఇంట్లో తాజాగా వరుణ్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈయన గత కొంతకాలంగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉంటూ పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా లావణ్య వరుణ్ తేజ్ వివాహం జరగడంతో మెగా ఫ్యామిలీలో ఇంకా సింగిల్ గా ఉన్నటువంటి తదుపరి హీరో సాయి ధరంతేజ్ పై పెళ్లి ఒత్తిడి పెరిగిందని తెలుస్తుంది. వరుణ్ పెళ్లి చేసుకోవడంతో తన కుటుంబ సభ్యులు తనని కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని తాజాగా సాయి ధరంతేజ్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

సాయి ధరమ్ తేజ సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఈ పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఎందుకు, వై, క్యో, ఎన్ ? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. నీకు పెళ్లి సంబరాలు..నాకు స్వతంత్ర పోరాటం అంటూ తేజు ఫన్నీ పోస్ట్ పెట్టాడు. స్వతంత్ర పోరాటం అంటే నేను సింగిల్ గా ఉండేదుకు పోరాడుతున్నా అని పరోక్షంగా తేజు ఈ పోస్టు ద్వారా తెలియచేశారు. ఇలా ఈయన పోస్ట్ చేశారు అంటే ఇంట్లో కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని అర్థమవుతుంది.

వయసులో వరుణ్ కంటే సాయి ధరమ్ తేజ్ పెద్దవారు అయినప్పటికీ ఇంకా సాయిధరమ్ తేజ సింగిల్గానే ఉన్నారు ఇక వరుణ్ పెళ్లి కూడా కావడంతో ఈయనని కూడా పెళ్లి చేసుకోవాలని పెద్దలు తనకు సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరి కొద్ది రోజుల్లోనే మెగా కాంపౌండ్ లో సాయి ధరంతేజ్ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇదివరకే సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడటం తన లవ్ బ్రేకప్ జరగడం వంటివి జరిగాయి అంటూ ఒక సందర్భంలో తెలియజేశారు. ఈయనకు బ్రేకప్ జరగడంతో తిరిగి మరెవరినైనా ప్రేమ వివాహం చేసుకుంటున్నారా లేకపోతే పెద్దలు చూసినటువంటి అమ్మాయితోనే ఏడడుగులు నడవబోతున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. యాక్సిడెంట్ కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సాయి తేజ్ (Sai Dharam Tej) ప్రస్తుతం తిరిగి సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus