Sai Dharam Tej: ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ లేదా? లేట్‌ అవుతుందా?

పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా, సాయిధరమ్‌ తేజ్ కొత్త సినిమా.. ఈ రెండూ చాలా రోజులుగా లింక్‌లో ఉన్నాయి. పవన్‌ ముందుకొస్తేనే.. సాయితేజ్‌ కొత్త సినిమా మొదలవుతుంది అంటూ గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. అంతేకాదు దీంతోపాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈ విషయంలో లింక్‌ అయి ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టుల్లో ఏది ముందుకు కదిలినా.. ఇంకో సినిమా సంగతి తేలిపోతుంది అని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ మొత్తం విషయంలో చిన్నపాటి క్లారిటీ వచ్చేసింది.

సాయితేజ్‌ కొత్త సినిమాను ఇటీవల స్టార్ట్‌ చేశారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో జయంత్‌ పానుగంటి దర్శకుడిగా ఈ సినిమా షురూ అయ్యింది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తామని టీమ్‌ ప్రకటించింది. ఆ సినిమా సంగతేమో కానీ పవన్‌ కల్యాణ్‌ సినిమాల గురించి క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పవన్‌, సాయితేజ్‌ కలసి ఓ సినిమా చేస్తారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయనే విషయం తెలిసిందే.

తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వినోదాయ చిత్తాం’ అనే సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు అంటూ.. గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన ఆ సినిమాను తెలుగులో పవన్‌ కల్యాణ్‌, సాయితేజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిస్తారు అని వార్తలొచ్చాయి. సముద్రఖని కూడా దాదాపుగా ఈ విషయం చెప్పారు కూడా. కానీ ఆ సినిమా ఇంకా మొదలుకాలేదు. నిర్మాత కూడా రెడీ అయిపోయారు. కానీ సినిమా మొదలవ్వలేదు.

అయితే, ఇలా కొన్ని రోజులు మాటలు అయ్యాక ఇటీవల ఎలాంటి ముచ్చట్లు లేవు. సినిమా కథ విషయంలో సమస్యలు అని కొందరు, ఫ్యాన్స్‌ నుండి వస్తున్న రియాక్షన్‌ అని కొందరు కారణంగా చెబుతున్నారు. సినిమాలో పవన్‌ స్థాయికి తగ్గ పాత్ర లేదని, ఆ కథలో కొత్తదనం కూడా లేదు అని అన్నారు. దీంతో సినిమా ఆగిపోయినట్లే అని కూడా అన్నారు. అయితే ఆ క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు సాయితేజ్‌ కొత్త సినిమా మొదలవ్వడంతో.. ఇక ‘వినోదాయ చిత్తాం’ లేనట్లే అని చెబుతున్నారు. మరి ఈ క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాఇల.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus