నాని రిజెక్ట్ చేసిన కథలో నటించనున్న సాయి ధరమ్ తేజ్

ఏ హీరో అయినా కథని వినేటప్పుడు.. ఆ కథ తన ఇమేజ్ కి సూటవుతుందా? అనే కోణంలో మాత్రమే చూస్తారు. నాని మాత్రం ఈ కథ ఎంతమందికి నచ్చుతుందని డైరక్టర్ కోణంలో ఆలోచిస్తారు. అదే అతని విజయాల వెనుక ఉన్న రహస్యమని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

మార్చిలో ఇది సెట్స్ మీదకు వెళ్ళాలి. అయితే ఈ చిత్రాన్ని చెయ్యడానికి నాని పెద్దగా ఆసక్తి చూపించడం లేదంట. అందుకే అతను ఈ ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. కిషోర్ తిరుమల నానిని బలవంతం చేయకుండా మరో హీరోని వెతికే ప్రయత్నంలో సాయి ధరమ్ తేజ్ ని కలిసి ఈ మూవీ కథని చెప్పారని తెలిసింది. ఈ కథ తేజుకి భలే నచ్చిందంట. పైగా తనకి ఈ రోల్ బాగా సెట్ అవుతుందని భావించి వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కిషోర్ తిరుమల ప్రాజక్ట్ మొదలు పెట్టనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus