Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా ఆల్‌మోస్ట్‌ ఓకే.. పేరులోనే చిన్న ట్విస్ట్‌!

గాయం తర్వాత రీఎంట్రీలో ‘విరూపాక్ష’తో అదిరిపోయే సినిమా ఇచ్చాడు సాయిధరమ్‌ తేజ్‌. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో కొత్త సినిమాను వెంటనే ప్రారంభించేశాడు. అదే ‘బ్రో’. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో మరో సినిమా దాదాపు ఓకే చేసేశాడని సమాచారం. ఈ సారి ప్రయోగాత్మక కథ కాకుండా… మాస్‌ ఇమేజ్‌ ఇచ్చే కథను పట్టుకున్నాడట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌ చేస్తారని టాక్‌. అయితే ఈ సినిమా పేరు ఇదే అంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. ఆ పేరులో తన మావయ్యల సినిమాల పేర్లు, పేర్లు రిఫరెన్స్‌గా కనిపిస్తున్నాయి.

మాస్ కథలు తయారూచేయడంలో మంచి పట్టు ఉన్న సంపత్ నందితో సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్‌తో ‘సీటీమార్’ సినిమా తర్వాత సంపత్ నంది నుండి మరో సినిమా రాలేదు. చాలామంది హీరోల దగ్గరకు ఓ కథ పట్టుకుని తిరిగినా.. దాదాపు ఓకే అనే పేరు వచ్చింది తప్ప… ఏదీ ఓకే అవ్వలేదు. తాజాగా సాయితేజ్‌కి అయితే ఓ కథ నచ్చిందట. త్వరలోనే సినిమాను పట్టాలెక్కిస్తారట.

ఈ సినిమాకు పేర్లు పరిశీలిస్తుండగా… ‘గాంజా శంకర్’ అనే పేరు కనెక్ట్‌ అయ్యిందట. శంకర్‌ అంటే చిరంజీవి పేరు నుండి తీసుకున్నది అని ఈజీగా చెప్పేయొచ్చు. ఇక గాంజా అంటే మాసీగా ఉండటానికి పెట్టినట్లున్నారు. మరోవైపు గంజాయి స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెప్పడానికి కూడా పనికొస్తుందని అలా కలిపారు అని అంటున్నరు. అలాగే ఈ పేరు వినగానే ‘గుడుంబా శంకర్‌’ అనే పేరు గుర్తొస్తుంది.

ఈ మొత్తం రిఫరెన్స్‌లు కనిపించేలా ఈ పేరు పెడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. గతంలో సాయితేజ్‌ తన మావయ్యల పేర్లు, సినిమాల పాటలు వాడుకునేవారు. వాటితో సినిమాకు మంచి బజ్‌ వచ్చేది. ఇప్పుడు వాళ్ల రిఫరెన్స్‌ పేర్లు పెడుతున్నాడు. మరి ఈ సినిమాకు ఎలాంటి బజ్‌ వస్తుందో చూడాలి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus