సాయి ధరమ్ తేజ్… తమ్ముడి సినిమా మొదలయ్యింది..!

‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. అయితే మొదటగా ‘రేయ్’ చిత్రం విడుదల కావాల్సినప్పటికీ కొన్ని కారణాల వలన అది విడుదల కాలేదు. ఇక ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘సుప్రీమ్’ వంటి వరుస సూపర్ హిట్లు సాధించి మాస్ హీరోగా మారిపోయాడు. చూడటానికి అచ్చం చిరంజీవి లాగే ఉంటాడనే ప్రశంసలు ఎప్పుడూ అందుకుంటూనే ఉంటాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘శంకర్ దాదా MBBS’ చిత్రంలో బాలనటుడిగా పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రాన్ని సుకుమార్ .. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా మొదలయ్యింది. ఈ చిత్ర పజా కార్యక్రమాలని ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టడంతో తొలి షాట్ ను హీరో హీరోయిన్ల పై చిత్రీకరించారు. కథానాయకుడిగా వైష్ణవ్ తేజ్ చాలా పెద్ద హీరో అవ్వాలని.. అలాగే సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కి అల్ ది బెస్ట్ చెప్పారు. తనతో పాటు చాలా మంది యువ దర్శకులు ఎదగాలని చేయూతనిస్తున్నందుకు సుకుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా తన ఆశీస్సులు అందజేశారు. ఈ చిత్ర టైటిల్ .. మరియు పూర్తి నటీ నటుల వివరాల్ని త్వరలో ప్రకటించబోతున్నట్టు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్,అల్లు అర్జున్, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus