టాలీవుడ్ కింగ్, మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ రీఎంట్రీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. సొంత నిర్మాణంలో, అన్ని విధాల సన్నిహితుడైనటువంటి ప్రియమైన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నాడు చిరు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఎలా అయినా హిట్ చెయ్యాలి అన్న కసితొ పనిచేస్తున్న చిరు, ఈ సినిమా హిట్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాను ఎలా అయినా బ్లాక్ బస్థర్ హిట్ చెయ్యాలనే ఆలోచానే ధ్యేయంగా ఒక పక్క మెగా ఫ్యామిలీలో హీరోలు అందరినీ చిరు ఈ సినిమాలో కనిపించేలా ప్లాన్ చేస్తూ ఉండగా, మరో పక్క మీడియా సమావేశంలో నోరు జారిన రైటర్ చిన్న కృష్ణను బుజ్జగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న వార్తలు టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ ఒకటి ఈ సినిమా గురించి బయటకు వచ్చింది…150వ సినిమాకు ఇప్పటికే టాలీవుడ్ టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ అందరు పనిచేస్తుంటే ఇప్పుడు ఆ సినిమాకు మరో టెక్నిషియన్ పనిచేసేందుకు ముందుకు అన్న వార్త బలంగా వినిపిస్తుంది…అదెవరో కాదు తన పెన్ పవర్ తో మనసుని కదిలించే మాటలతో అందరిని ఆకట్టుకున్న మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఇప్పుడు చిరు సినిమా కోసం పనిచేయబోతున్నాడట. ఇప్పటికీ ఈ సినిమాకోసం జుట్టు మెరిసిన రచయితలు పరుచూరి సోదరులు పనిచేస్తూ ఉండగా….మరి కొత్తగా ఈ రచయిత ఏం చేస్తాడో అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా…చిరు సినిమా హిట్ కోసం ఏం చెయ్యడానికైన రెడీగా ఉన్నాడు అని అర్ధం అవుతుంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకూ కలసి వస్తాయో చూడాలి.