వావ్… ఈ టైటిల్ అదిరిపోయింది శేఖర్ కమ్ముల..!

  • October 31, 2019 / 08:17 PM IST

పెద్దగా హడావిడికి పోకుండా సింపుల్ కధలతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. స్టార్ హీరోలు, కామెడీ ట్రాక్ లు, పంచ్ డైలాగులు ఈయన సినిమాల్లో ఉండవు.. కానీ ఈయన సినిమా అంటే ప్రేక్షకులకు ఓ రేంజ్ ‘ఎక్స్ పెక్టే షన్స్’ ఉంటాయి. సింపుల్ కథని చాలా సెన్సిబుల్ గా చెబుతుంటాడు. ప్రేక్షకులందరినీ మరో లోకానికి తీసుకెళ్తుంటాడు. మరి ఇలాంటి క్లాస్ డైరెక్టర్ కి నాగచైతన్య లాంటి విపరీతమైన క్లాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో దొరికితే ఎలా ఉంటుంది. దానికి తోడు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ అయితే.. ఇక ఆ సినిమా పై భారీ అంచనాలు నెలకొంటాయి అనడంలో సందేహం లేదు.

ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారని సమాచారం. టైటిల్ వింటుంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి కదా. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి. ఇక ప్రముఖ ‘ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ’ ద్వారా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus