Sai Pallavi, Kamal Haasan: మల్ హాసన్ ను కలిసిన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఫోటో వైరల్!

లోకనాయకుడు లెజెండ్రీ నటుడు కమలహాసన్ ను నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కలిసారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సాయి పల్లవి కమల్ హాసన్ ను కలవడానికి గల కారణం అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆరా తీస్తున్నారు.కమల్ హాసన్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ తనకు వీలు దొరికినప్పుడల్లా తన ప్రొడక్షన్ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

కమల్ హాసన్ సొంత బ్యానర్లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న 21వ చిత్రానికి రాజ్ కుమార్ పెరియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన నటిస్తున్న విషయం వెల్లడించారు.ఇలా కమలహాసన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కడంవల్ల సాయి పల్లవి లెజెండరీ హీరో కమల్ హాసన్ ను కలిశారు. ఇలా సాయి పల్లవి కమల్ హాసన్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఈ సందర్భంగా ఈ ఫోటోలను షేర్ చేస్తున్న సాయి పల్లవి మాట్లాడుతూ కమల్ హాసన్ సార్ ను కలవడం వల్ల ఉత్తమ నటిగా మారే మెళుకువలను తెలుసుకున్నాను. అలాగే ఒక మంచి వ్యక్తిగా మారే అంశాలను కూడా తన నుంచి తెలుసుకున్నానని సాయిపల్లవి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇలా సాయి పల్లవి కమల్ హాసన్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిగా నటించిన శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇకపోతే ఈమె రానా సరసన నటించిన విరాటపర్వం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా సాయి పల్లవి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus