Sai Pallavi: వెన్నెల పాత్రలో నటించడం గర్వంగా ఉంది!

  • June 20, 2022 / 10:21 AM IST

సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. 1990లో సరళ అనే మహిళ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సరళ పాత్రలో సాయి పల్లవి వెన్నెలగా ఎంతో అద్భుతంగా నటించారు.నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి డైరెక్టర్ వేణు అందమైన ప్రేమ కావ్యం జోడించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. జూన్ 17వ తేదీ విడుదల ఆయన ఈ సినిమా మొదటి షో తోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా అద్భుతమైన కలెక్షన్లను కూడా రావడంతో చిత్ర బృందం శనివారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా సాయి పల్లవి సరళ పాత్రలో నటించడంతో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరళ అన్నయ్య మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ చేయడమే కాకుండా

తమ కుటుంబాన్ని కలవడం కోసం ఖమ్మం వెళ్లినప్పుడు వారు తనని తమ ఇంటి ఆడబిడ్డ గా భావించి తనకు చీర ఇచ్చి సత్కరించి ఆశీర్వదించారని తెలిపారు. ఆ క్షణం సరళ గారి కుటుంబాన్ని చూసి గుండె బరువెక్కి పోయిందని కన్నీళ్లొచ్చాయని తెలిపారు. గొప్ప మనసు ఉన్న వాళ్ళు మళ్ళీ పుడతారు వారు అనుకున్నది వేరే మార్గంలో సాధించుకుంటారని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలిపారు.

ఈ విధంగా సరళ నిజజీవితం ఆధారంగా వెన్నెల పాత్రలో నటించడం చాలా గర్వంగా ఉంది అంటూ ఈమె తెలిపారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తామని, సినిమా చూసిన ప్రతి సారీ చాలా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది అంటూ సాయి పల్లవి సినిమా విజయం గురించి మాట్లాడారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus