Sai Pallavi: ప్రతిభ ఉన్నా సాయిపల్లవికి అవార్డ్ దక్కలేదా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి (Sai Pallavi) కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతూ తెలుగుతో పాటు ఇతర భాషల ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. అయితే అవార్డుల విషయంలో హీరోయిన్ సాయిపల్లవికి అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ ఉన్నా సాయిపల్లవికి అవార్డ్ దక్కలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జాతీయ అవార్డులలో గార్గి సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయిపల్లవికి ఉత్తమ నటిగా అవార్డ్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు.

Sai Pallavi

గార్గి సినిమాలో అద్భుతమైన అభినయంతో సాయిపల్లవి మెప్పించగా రిలీజ్ సమయంలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గార్గి మూవీకి అవార్డ్ అందుకోవడానికి సాయిపల్లవి అన్ని విధాలా అర్హురాలు కాగా తిరుచిత్రాంబళం అనే సినిమాలో నిత్యమీనన్ నటనకు ఈ అవార్డ్ వచ్చింది. నిత్యామీనన్ తో (Nithya Menen) పాటు మానసి పరేఖ్ అనే నటికి కూడా ఉత్తమ నటిగా అవార్డ్ దక్కింది.

సాయిపల్లవికి అవార్డ్ రాకపోవడం అంటే ఏదో కుట్ర జరిగిందని అభిమానులు భావిస్తున్నారు. సాయిపల్లవి సైతం అవార్డులకు సంబంధించి తనకు జరిగిన అన్యాయం గురించి స్పందిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విషయంలో న్యాయం జరగగా జాతీయ ఉత్తమ నటి అవార్డ్ విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

సాయిపల్లవికి లక్ లేదని అందుకే అవార్డ్ రాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జాతీయ అవార్డ్స్ విషయంలో సాయిపల్లవి ఫ్యాన్స్ కు ఒకింత భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. సాయిపల్లవి సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. సాయిపల్లవికి భవిష్యత్తులో అయినా జాతీయ ఉత్తమ నటి అవార్డ్స్ దక్కుతాయేమో చూడాల్సి ఉంది. సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus