Sai Tej: సాయితేజ్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన మీమర్స్.. సాయితేజ్ జవాబిదే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో థియేటర్లలో బ్రో మూవీ రిలీజవుతోంది. పవన్, సాయితేజ్ కాంబో మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సాయితేజ్ పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్రో సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. అయితే తిక్క హీరోయిన్ లారెస్సాతో సాయితేజ్ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే బ్రో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయితేజ్ మీమర్స్ తో మాట్లాడగా ఒక మీమర్ లారిస్సా వదిన ఎలా ఉంది అన్న అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్న విని ఒకింత ఆశ్చర్యానికి గురైన సాయితేజ్ ప్రశ్న ఏంటి నాకు సరిగ్గా అర్థం కాలేదు అని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ తర్వాత సాయితేజ్ ఆ ప్రశ్నకు బదులిస్తూ లారిస్సా పేరులో ఉన్న వైబ్రేషన్ అలాంటిది అని వెల్లడించడం గమనార్హం.

సాయితేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సాయితేజ్ బ్రో సినిమాతో సక్సెస్ సాధిస్తే రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. బ్రో సినిమా కమర్షియల్ టార్గెట్ 100 కోట్ల రూపాయలు కాగా ఆ టార్గెట్ ను ఈ సినిమా సులువుగానే సొంతం చేసుకుంటుందేమో చూడాలి. తిక్క సినిమా డిజాస్టర్ గా నిలిచినా ఈ సినిమాలో నటించిన సాయితేజ్, లారెస్సా జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

సాయితేజ్ (Sai Tej) సంపత్ నంది కాంబినేషన్ లో గాంజా శంకర్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సాయితేజ్ రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus