సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో డైరెక్టర్ శంకర్ ఒకరు. ఈయన సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమాకు డైరెక్షన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా దాదాపు 80% వరకు షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.
అయితే ఒకానొక సమయంలో శంకర్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నటువంటి ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో రామ్ చరణ్ సినిమాని మరొక డైరెక్టర్ కి అప్పగించారంటూ వార్తలు కూడా వచ్చాయి. హిట్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు అంటూ వార్తలు వచ్చాయి దీంతో ఒక్కసారిగా చరణ్ అభిమానులు కంగారుపడ్డారు.
ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే గేమ్ ఛేంజర్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా సైంధవ్ సినిమా ద్వారా డైరెక్టర్ శైలేష్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఇదే ప్రశ్న ఎదురు కావడంతో శైలేష్ అసలు విషయం వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నేను గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ చేశాను కానీ అంటూ అసలు విషయం వెల్లడించారు. ప్రతి సినిమాలోను కొన్ని బీరవల్ షార్ట్స్ అనేవి ఉంటాయి. అక్కడ క్యారెక్టర్స్ ఎవరు ఉండరు వెహికల్ పాసింగ్ గాని డ్రోన్ షాట్స్ కానీ ఉంటాయి. అలాంటివి శంకర్ సర్ ఎవరికీ చెప్పరు కానీ వాళ్ళు ఒక లొకేషన్ లో స్ట్రక్ అవటం వల్ల ఈ సీన్స్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆ సమయంలో రాజు గారు నాకు ఫోన్ చేసి ఇలా చేయాలి అని చెప్పడంతో వెంటనే నేను రెండు రోజుల పాటు ఆ షాట్స్ చేశానని తెలిపారు. అంతకుమించి నేను ఈ సినిమాలో ఎక్కడ ఎలాంటి పనులు చేయలేదని తెలిపారు. ఇక శంకర్ సార్ ఇలాంటి విషయాల్లో చాలా పక్కాగా ఉంటారు. అలాంటిది ఇలాంటి సీన్స్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కావాలని చెప్పడంతో రాజుగారు నాకు ఫోన్ చేశారు. అలా నేను ఈ సినిమాలో భాగమయ్యాను అంటూ ఈ సందర్భంగా శైలేష్ (Sailesh Kolanu) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!