వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సైంధవ్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో వెంకటేశ్ మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సైంధవ్ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.
ఈ సినిమాలో వెంకటేశ్ కూతురు ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో బాధ పడుతుందని ఆ వ్యాధి చికిత్స కోసం 17 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ అవసరం అవుతుందని ఆ ఇంజక్షన్ విలన్ కు కూడా అవసరం కావడంతో ఒకటే ఇంజక్షన్ ఉండటంతో ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
వెంకట్ బోయినపల్లి నిర్మాతగా ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని భోగట్టా. విక్టరీ వెంకటేశ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. వెంకీ ఈ సినిమాకు 13 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
వరుసగా విజయాలను సొంతం చేసుకున్న శైలేష్ కొలను (Saindhav) ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు. శైలేష్ కొలను త్వరలో నానితో హిట్3 సినిమాను కూడా తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉంది. సైంధవ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని వెంకటేశ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.