Sairam Shankar: నన్ను అడ్డం పెట్టుకుని ఆ సినిమాలను ట్రోల్ చేస్తున్నారు: సాయి రామ్ శంకర్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తమ్ముడు సాయి రామ్ శంకర్ (Sairam Shankar) అందరికీ సుపరిచితమే. ‘ఇడియట్’ (Idot) సినిమాతో నటుడిగా పరిచయమైన ఇతను ఆ తర్వాత ‘143’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడినా.. సాయి రామ్ శంకర్ కి హీరోగా మంచి మార్కులే పడ్డాయి అని చెప్పాలి. ఆ తర్వాత కృష్ణవంశీ ‘డేంజర్’ (Danger) సినిమాలో నటించాడు. ఆ సినిమా ప్లాప్ అయినా టీవీల్లో బాగానే చూశారు.

మళ్ళీ హీరోగా చేసిన ‘హలో ప్రేమిస్తారా?’ ప్లాప్ అయ్యింది. దీంతో ‘నేనింతే’ (Neninthe) లో మళ్ళీ ఓ స్పెషల్ రోల్ చేశాడు. దీనికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సాయి రామ్ శంకర్ హీరోగా ‘బంపర్ ఆఫర్’ చేశాడు. అది యావరేజ్ గా ఆడింది. అయితే ఆ తర్వాత ఇతను హీరోగా చేసిన ‘వాడే కావాలి’ ‘యమహో యమ’ ‘1000 అబద్దాలు’ ‘దిల్లున్నోడు’ ‘రోమియో’ (Romeo) ‘వాడు నేను కాదు’ ‘అరకు రోడ్డులో’ ‘నేనోరకం’ వంటి సినిమాలు వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.

అయితే దాదాపు 7 ఏళ్ళ తర్వాత ‘వెయ్ దరువెయ్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు సాయి రామ్ శంకర్. నవీన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దేవరాజ్ పాతూరు నిర్మాత. ఇక ఈ ‘వెయ్ దరువెయ్’ సినిమా ప్రమోషన్స్ లో సాయి రామ్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ‘నేను ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. ‘నేనింతే’ సినిమా మీమ్స్ రూపంలో జనాలకి దగ్గరగానే ఉన్నాను. ఏ సినిమాకి ప్లాప్ టాక్ లేదా నెగిటివ్ టాక్ వచ్చినా..

‘నేనింతే’ లో నా సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా ఇలా అందరికీ దగ్గరగా ఉన్నందుకు హ్యాపీగా అనిపించినా, మరో రకంగా ఇంకో సినిమాని నా ద్వారా ట్రోల్ చేస్తున్నందుకు బాధగా అనిపిస్తుంది.అది పక్కన పెడితే ‘వెయ్ దరువెయ్’ నాకు మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది అని నమ్ముతున్నాను. మార్చి 15 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి” అంటూ సాయి రామ్ శంకర్ చెప్పుకొచ్చాడు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus