తెలుగులో “పోటుగాడు, జేమ్స్ బాండ్” లాంటి సినిమాల్లో నటించిన సాక్షి చౌదరి గత కొన్ని సంవత్సరాలుగా ఒక మంచి హిట్ కోసం తన సొగసుల సత్తాతో ప్రేక్షకులపై దండయాత్ర చేస్తూనే ఉంది. కానీ.. ఆ సినిమాలేవీ ఆమెకు హిట్ కాదు కదా కనీసం మంచి పేరు కూడా తెచ్చిపెట్టలేదు. మరి తనను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడిందో లేక ఇలా చేస్తే హైలైట్ అవుతావు అని ఎవరైనా చెప్పారో తెలియదు కానీ.. మొన్న ఉన్నట్లుండి తనను రాత్రికి రమ్మని ఒక వ్యక్తి కోటి రూపాయలు ఆఫర్ చేశాడని, అలా ఎలా అడగాలి అనిపిస్తుందని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ పెట్టింది అమ్మడు.
ఇదే విషయమై క్లారిటీ కోసం నిన్న జరిగిన “సువర్ణ సుందరి” ట్రైలర్ లాంచ్ లో మీడియా ఆమెను ప్రశ్నించగా.. చాలా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది సాక్షి చౌదరి. కొద్ది నిమిషాల్లోనే ఆమె ట్వీట్ కూడా డిలీట్ అయ్యింది. దాంతో ఆమెకు నిజంగానే ఎవరైనా అలాంటి ఆఫర్ చేశారా లేక పబ్లిసిటీ కోసం కావాలనే అమ్మడు అలాంటి పోస్ట్ పెట్టిందా అనే వాదనలు మొదలయ్యాయి. ఈ వాదనలు పక్కన పెడితే.. హీరోయిన్ గా ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి టైమ్ తోపాటు కావాల్సినంత గ్లామర్, ఓపిక ఉన్న సాక్షి ఇలాంటి చీప్ పబ్లిసిటీ వల్ల తన కెరీర్ ను తానే రిస్క్ లో పడేసుకోవడం తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు.