Jr NTR: ఎన్టీఆర్ సినిమాల లెక్కలు మారబోతున్నాయా.. సలార్ మూవీ వల్లే అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మాస్ ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటించనున్నారు. వార్2 సినిమాకు తారక్ పరిమితంగా డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా సలార్ సినిమా వాయిదా పడటం వల్ల ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ కూడా ఆలస్యం కానుందని సమాచారం అందుతోంది.

వాస్తవానికి ఎన్టీఆర్ (Jr NTR)  ప్రశాంత్ నీల్ కాంబో మూవీ 2024 సంవత్సరం మార్చి నెల నుంచి మొదలుకావాల్సి ఉంది. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. ఈ సినిమా 2025 సంవత్సరం సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.

400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో కాంబో మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రశాంత్ నీల్ తక్కువ బడ్జెట్ లోనే సినిమాలను తెరకెక్కించి నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నారు. బ్లాక్ షేడ్స్ లో హీరోలను చూపించడానికి ప్రశాంత్ నీల్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రశాంత్ నీల్ వేగంగా సినిమాలను తెరకెక్కించాలని ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus