3 ఏళ్లుగా ‘నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్’ గా కొనసాగుతూ వచ్చిన ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ ను అధిగమించి ‘సలార్’ సరికొత్త క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఫుల్ రన్లో రూ.161 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా.. ‘సలార్'(తెలుగు వెర్షన్) విడుదలైన 5 రోజుల్లోనే రూ.163 కోట్ల షేర్ ను రాబట్టి.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
సంక్రాంతి టైం వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ‘సలార్’ తెలుగు వెర్షన్ ఇంకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మొత్తంగా ‘సలార్’ తెలుగు వెర్షన్ రూ.185 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు. అది రూ.200 కోట్లు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే అందరి ఫోకస్ ఇప్పుడు ‘గుంటూరు కారం’ పై పడింది. 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ‘గుంటూరు కారం’… ‘సలార్’ కలెక్షన్స్ ని అధిగమించి ‘నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్’ గా నిలుస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ‘గుంటూరు కారం’ నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ .. ‘ ‘గుంటూరు కారం’ సినిమాతో రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్తాము’ అంటూ పలుమార్లు కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ‘సలార్’ తెలుగు వెర్షన్ కలెక్షన్స్ ని (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ అధిగమిస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!